హైదరాబాద్ : నువ్వా -నేనా అన్నట్టు హుజూరాబాద్ లో పోటాపోటీ గా అధికార టీఆర్ఎస్ – బీజేపీ మధ్య ప్రచారం జరుగుతున్నా కూడా ఎన్నికలకు మాత్రం మరె నెలా రెండు నెలలు వేచి ఉండాల్సిందే. బెంగాల్ లో మూడు, ఒడిశా లో ఒక అసెంబ్లీకి సెప్టెంబర్ 30 న ఎప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలంగాణ లోని హుజూరాబాద్ , ఆంద్రప్రదేశ్ లో ని బద్వేల్ స్థానానికి ఉప ఎన్నిక మరింత ఆలస్యం కానున్నది. అక్టోబర్ లేదా నవంబర్ లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులతో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణ సహా పదకొండు రాష్ట్రాలు వానలు, వరదలు, కరోనా, పండగల కారణంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా లేమని లిఖిత పూర్వక లేఖలు రాశాయి. దీంతో ఎన్నికలకు సంసిద్దత వ్యక్తం చేసిన బెంగాల్, ఒడిశాలో మాత్రమే ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఉప ఎన్నికలకు నిర్వహణకు సిద్ధంగా లేమని ఈసీకి తెలిపిన ఏపీ, తెలంగాణ, అసోం, బీహార్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ,రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలి,డామన్ డయ్యు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మమతా బెనర్జీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నారు.