కాంగ్రెస్‌ సాహసోపేత నిర్ణయం..!! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు.. స్పష్టం చేసిన ప్రియాంకా వాద్రా

రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్ర తెలిపారు. పార్టీ శ్రేణులతో పాటుగా.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ బేరర్లు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేద్దామని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియాంకా వాద్రా తెలిపారు. రాష్ట్రంలోని 403 స్థానాల్లో ఈ సారి ఏ పార్టీతో పొత్తు లేకుండా అభ్యర్ధులను నిలిపిందుకు సిద్ధమయ్యామని.. సమాజ్‌వాదీ పార్టీతో కానీ, బీఎస్‌పీతో కానీ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఆదివారం నాడు జరిగిన ‘ప్రతిజ్ఞ సమ్మేళన్-లక్ష్య 2022’లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో 14 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. అన్ని స్థానాలకు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే నామినేట్ చేస్తామని.. కాంగ్రెస్ పార్టీ గెలవవాలంటే, సొంతంగానే గెలుస్తుందన్నారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

మరోవైపు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘెల్‌ మాట్లాడుతూ.. స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమని అన్నారు. దీంతో ఇప్పుడు మరి యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా వాద్రా చెప్పినట్లు ఒంటరిగా పోటీ చేస్తుందా.. లేదా సమయానికి మైండ్‌సెట్ చేంజ్‌ చేసుకుని పొత్తుల బాట పడుతుందా..? అన్నది వేచిచూడాల్సిందే.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *