హైదరాబాద్ : ఆగస్టు 15 స్వతంత్ర దితనోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై ఉదయం పదిన్నరకు జెండా ఆవిష్కరణ చేస్తారని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం బీఆర్కే భవన్ లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో తగిన మౌళిక వసతులను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచన చేశారు.
ఈ సమావేశంలో టిఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, అడిషనల్ డిజి జితేందర్ , కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్, జిఏడిముఖ్యకార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, ఎనర్జీ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.