న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుకరించే పద్మ అవార్డుల కోసం నామినేషన్లను సెప్టెంబర్ 15 వరకు ఆన్ లైన్ లో స్వీరిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 2022 జనవరి 26 న ఇచ్చే పద్మ అవార్డుల కోసం స్వయంగా నామినేషన్ లేదా రికమండేషన్ లు కేవలం పద్మఅవార్డు పోర్టల్ ద్వారా మాత్రమే చేసుకోవాలని హోంశాఖ సూచించింది.
పద్మ అవార్డులను ప్రజల అవార్డులగా మార్చడం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఎవరైనా ఏ రంగంలో అయిన విశిష్ట సేవ చేసిన వారిని గుర్తించి కేంద్రానికి సూచించడం ద్వారా సమాజం పట్ట మన బాధ్యత మరింత నెరవేర్చిన వాళ్లమైతామని , అందుకు మీ చుట్టుపక్కల ఉండే వారిని గుర్తించి అందుకు సంబంధిచిన పూర్తి వివరాలు పంపాలని కేంద్రం కోరింది.