• ఓటుకు కేసీఆర్ రూ.20 వేలు ఇస్తున్నరట కదా….మీకు వచ్చినయా?( రాలేదంటూ జనం సమాధానం…). టీఆర్ఎసోళ్లు రూ.14 వేలు కటింగ్ చేసుకుని రూ.6 వేలే ఇస్తున్నరట.
• ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో, కోవిడ్ సమయంలో చేసిన సేవలు మరువలేనివి.
• నాలుగున్నర నెలలుగా నాయకులను బెదిరించినరు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారు.
• ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. 30న పువ్వు గుర్తుపై ఓటేయాలే కేసీఆర్ బాక్సులు బద్దలు కావాలి.
• ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతులు వరి పండిస్తరు. ఈటల రాజేందర్ గెలిస్తే ఏం వస్తదని అంటున్నరు.
• కేసీఆర్ గడీల నుండి ఇంటినుండి బయటకొస్తడు. సోయి వస్తది.
• కేసీఆర్ గల్లా పట్టి వరి కొనేలా చేస్తాం. ప్రతి గింజ కొనేలా చేస్తాం.
• ఇవి హుజూరాబాద్ కే పరిమితమైన ఎన్నికలు కావు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలివి.
• ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే….రైతులు వరి పండిస్తే ఉరేస్తామని బెదిరిస్తాడు కేసీఆర్…
• మీకు వరి కావాలా? ఉరి కావాలా? ఆలోచించండి.
• వరి కావాలంటే ఈటల ను గెలిపించండి. కేసీఆర్ గల్లా పట్టి గుంజి కొడతం.
• మీకు దళిత బంధు కావాలంటే…ఈటలను గెలిపించాలి. టీఆర్ఎస్ గెలిస్తే దళిత బంధు ఆగిపోతుంది. ఈటల గెలిస్తే హుజూరాబాద్ నుండే బీజేపీ యుద్దం చేస్తుంది.
• మీకు పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలన్న పువ్వు గుర్తుకు ఓటేయండి. ఈటల గెలిచాక మీ కోసం ప్రశ్నించి కేసీఆర్ మెడలు వంచుతాం.
• ఈటల మీకు కన్న కొడుకుగా అండగా ఉంటాడు. ఏ కష్టమొచ్చినా ఆదుకునేది ఈటల మాత్రమే.
• ఈటలను ఎదుర్కొవడానికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఆయన ఎంత ధైర్యవంతుడో అర్ధమవుతుంది.
• తెలంగాణలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు అందాలంటే కేసీఆర్ కు బుద్ది రావాలి. అది జరగాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి.
• కేసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్. అడ్డగోలు దందాలు చేసి కోట్లు దండుకుని అడ్డదారిలో గెలిచేందుకు కుట్ర చేస్తున్నడు.
• ఈటల రాజేందర్ నిజాయతీగా వ్యాపారం చేసి సంపాదించిండు.
• బీజేపీ దాడులు చేస్తుందని విష ప్రచారం చేస్తున్నరు. ఇన్నాళ్లూ ప్రచారం జరిగింది ఎక్కడైనా గొడవలు జరిగాయా? మీరే ఆలోచించాలి.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
• కేసీఆర్ అవమానించినందునే ఆత్మగౌరవం కోసం రాజీనామాను ఆయన ముఖం మీద కొట్టి వచ్చాను.
• కేసీఆర్ వద్ద వేల కోట్లు డబ్బుండొచ్చు. కుట్రలుండొచ్చు. పోలీసులుండొచ్చు. నాకు అండగా ప్రజలున్నారు.
• ఓటుకు రూ.6 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నరు. రూ.20 వేలదాకా ముట్టజెబుతున్నరట.
• నా ఆడబిడ్డల్లారా? ప్రజలారా…..ఈటల రాజేందర్ 18 ఏళ్లుగా ఎంతగా అభివ్రుద్ది చేస్తున్ననో మీకు తెలుసు.
• కానీ రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెబుతున్న టీఆర్ఎస్ నేతలకు ఇక్కడి ప్రజలు ఈనెల 30న తగిన బుద్ది చెప్పబోతున్నరు.
• ఏ పదవి ఇచ్చినా తెలంగాణ మెప్పు పొందాను. ప్రజల ఆత్మగౌరవ బావుటాను ఎగరేశాను.
• నేను 27న దెబ్బలు తగిలనట్లు కట్టుకట్టుకుని వీల్ ఛైర్ పై కూర్చొని ఓట్లడుగుతానని అన్నారు. ఇంత నీచానికి దిగజారిన వ్యక్తులను ఏమనాలి?
• పచ్చని సంసారంలో చిచ్చు పెట్టే నీచులు వీరే…వీళ్లను ఏమనాలో కూడా అర్ధం కావడం లేదు. వీళ్ల కార్యకలాపాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నయ్.
• బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అవమానించేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది.
• దేశంలోని రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యావేత్తలు, మీడియాకు విజ్ఝప్తి…..
• 75 ఏళ్ల భారత చరిత్రలో ఏ నియోజకవర్గంలోనూ వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాల్లేవు కోట్ల కొద్ది మందు తాగించలేదు. ఈ స్థాయిలో ఎక్కడా బెదిరింపులకు పాల్పడలేదు.
• హుజూరాబాద్ ప్రజలు అడ్డుకోవడం ఖాయం. టీఆర్ఎస్ కు తగిన బుద్ది చెప్పడం ఖాయం.
• తెలంగాణ ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లుమన్పించబోతున్నరు. ఆ సువర్ణావకాశం ముందుగా హుజూరాబాద్ ఫ్రజలకే దక్కింది.
• బీజేపీ గెలిస్తే పెన్షన్, రేషన్ కార్డులు రద్దవుతాయని భయపెడుతున్నరు. గతంలోనూ ఇట్లనే ప్రచారం చేశారు. కానీ ఎక్కడైనా రద్దయ్యాయా?
• క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతుండటంవల్లే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. కేంద్రం గ్యాస్ పై పన్ను రూ.21 మాత్రమే…రాష్ట్రం కూడా అంతే వసూలు చేస్తోంది. దీనికి ఈటల రాజేందర్ కు ఏం సంబంధం?
• హుజూరాబాద్ ఫ్రజాలారా….ఒక్కసారి ఆలోచించుకోండి. నన్ను చంపుకుంటారా?….బతికించుకుని మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తారా? మీరే ఆలోచించండి.
• కేసీఆర్…..నన్ను సాధించే ప్రయత్నం చేస్తున్నరు. ప్రజలు మీరే ఆలోచించుకుని కాపాడుకోవాలని కోరుతున్నా.