హైదరాబాద్ : బంగారు శంఖం ఊది పాదయాత్ర ప్రారంభించే లాగా బండి సంజయ్ అభిమానులు శంఖం సిద్దం చేశారు. తెలంగాణలో పార్టీ అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా కురుక్షేత్ర యుద్దాన్ని జయించిన అర్జునుడి లాగా సంజయ్ చేసే ఈ రాజకీయ యుద్దం గెలవాలను ఆకాంక్షతో ఈ శంఖం తయారు చేసినట్టు సంజయ్ అభిమాని, బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాద్యక్షుడు పొన్న వెంకటరమణ పొలిటికల్ వాయిస్ తో చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నా కూడా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ శంఖనాదంతోనే తెలంగాణలో అధికార మార్పు రావడం ఖాయమని వెంకటరమణ ఆశాభావం వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి పాదయాత్ర ప్రారంభం కావడం తో తెలంగాణలో హిందువుల ఐక్యత కు బాటలు వేస్తుందని, అలాంటి అమ్మవారి ఆశీర్వాదంతో బంగారంతో ప్రత్యేకంగా చేయించిన శంఖంను అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ రాజకీయ రణన్నినాదం ఈ శంఖం ద్వారా చేసి తొలి అడుగు వేయడం అధ్బుతగట్టంగా మారుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలి బీజేపీ సర్కార్ కు నాంది సూచకంగా ఈ శంఖం నిలుస్తుందని, చరిత్ర సృష్టించడం ఖాయం అని ఆశగా చెప్పారు.
ఫోటో -బండి సంజయ్ తో పొన్న వెంకటరమణ
ఇదే శంఖంతో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఎన్నికల శంకారావాన్ని చేసే ఆలోచనతో ఉన్నట్టు వెల్లడిచారు పొన్న వెంకటరమణ
Congratulations Anna; good initative took by you to start a good work with the voice of Shankaravam as it is the custom according to the Hindu Dharma…congratulations once again……..