మే 7,2024 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునే చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్య నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. విజయనగరం జిల్లాలో గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ ఉత్కంఠ పెంచుతుంది. జిల్లాలో బొత్స కుటుంబానికి చెక్ పెట్టెందుకు ఈ నియోజకవర్గంలో టిడిపి కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుంది. విజయనగరం జిల్లాలో పోటీ రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో వైసిపి ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించింది. టిడిపికి బలమైన కేడర్ ఉన్న ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించేందుకు ఆ పార్టీ వ్యూహం అమలు చేస్తుంది. జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. ఇకనుంచి టిడిపి అభ్యర్థిగా బొత్స కుటుంబం నుంచి అప్పల నరసయ్య పోటీలో ఉన్నారు. టిడిపి నుంచి కొండపల్లి శ్రీనివాస్ బరిలో నిలిచారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి టిడిపి ఐదు సార్లు గెలిచింది. ఎన్నారై కావటంతో పాటుగా ఉన్నత విద్యావంతుడు కావడం కొండపల్లి శ్రీనివాస్ కు స్థానికంగా ఆదరణ లభిస్తుంది. దీంతో పాటుగా పార్టీ ఓటింగ్, ప్రభుత్వంపై వ్యతిరేకత, మూడు పార్టీల ఓటింగ్ అదనపు అనుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అప్పల నరసయ్య పైన స్థానికంగా వ్యతిరేకత ఉంది. అయినా ఆయనకే తిరిగి వైసిపి సీటు కేటాయించింది. నియోజకవర్గంలో ఐదేళ్లకాలంగా తన మార్పుగా చెప్పుకునే అంశం ఒకటి లేకపోవడం అప్పల నరసయ్యకు మైనస్ అయింది. సంక్షేమ పథకాలతో మాత్రమే ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీలో ఉన్న అసంతృప్తిని గుర్తించిన కొండపల్లి శ్రీనివాస్ వారిని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. పలువురిని టిడిపిలో ఆహ్వానించారు. గ్రామ గ్రామాన ఓటింగ్ శాతాన్ని పెంచుకునే విధంగా క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. గజపతినగరంలో టిడిపి అనుకూలత ఎక్కువగా ఉండటంతో మెజార్టీ పైనే ప్రస్తుతం కొండపల్లి శ్రీనివాస్ ఫోకస్ చేశారు. టిడిపికి మద్దతుగా జనసేన బీజేపీ శ్రేణులు సహకారం అందిస్తున్నాయి. ఎన్ఆర్ఐ కావడంతో పార్టీ అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉపాధి అవకాశాల పైన శ్రీనివాస్ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న యువతతో పాటుగా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన నియోజకవర్గం ఓటర్లు సైతం శ్రీనివాస్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. స్థానికంగా నియోజకవర్గ అంశాలపైనే ప్రధానంగా వివరిస్తున్న శ్రీనివాస్ తాను గెలిచిన తర్వాత తీసుకొచ్చే మార్పుల పైన ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే గజపతినగరంలో కొండపల్లి శ్రీనివాస్ కు అనుకూలత ఉందని ప్రచారం స్థానికంగా బలంగా వినిపిస్తుంది. పాజిటివ్ టాక్ తో టిడిపి అభ్యర్థి చివరి ఐదు రోజులు ప్రచారం వేగం పెంచారు. ఈ ఐదు రోజులే ఎన్నికలకు కీలకం కావడంతో వైసిపి ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఎలక్షన్ నిర్వహణ సమయంలో ఏ రకంగా వ్యవహరించాలని దేశం చేస్తున్నారు. పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ పైనే కొండపల్లి శ్రీనివాస్ ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నారు. అప్పల నరసయ్య ప్రత్యేకంగా నియోజకవర్గ కోసం తాను ఏం చేశాను అనేది చెప్పుకోలేని పరిస్థితిలో ఉండటం శ్రీనివాస్ కు బలంగా మారింది. నియోజకవర్గంలో తాను గెలిస్తే మార్పు తీసుకువస్తానని.. తనకు స్పష్టమైన విజన్ ఉందని ఓటర్లకు వివరిస్తున్నారు. అదే సమయంలో జిల్లాలో తమకు తిరుగులేదని భావిస్తున్న బొత్స కుటుంబానికి షాక్ ఇచ్చేందుకు గజపతినగరం ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కొండపల్లి శ్రీనివాస్ విజయం వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో, విజయనగరం ఎన్నికల ఫలితం పైన ఆసక్తి కొనసాగుతుంది.