మిర్యాలగూడ : వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరగాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిలషించారు. మిర్యాలగూడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయిన ఆయన అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆన్ లైన్ క్లాస్ ల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలు చదువు కు దూరం అవుతున్నారని , దీనికి వ్యాక్సినేషన్ పెంచడం ఒక్కటే మార్గం అన్నారు .