హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం ఆస్తులను జాతీయం చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు.మూడవ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగిసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోకి పాదయాత్ర చేరింది. బాపుఘాట్ నుంచి టిప్పు ఖాన్ వారధి మీదుగా రాజేంద్రనగర్ అసెంబ్లీలో కి చేరింది. వేలాది సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు అక్కడ స్వాగతం పలికారు. అనంతరం కాళీ మందిరం నుంచి ఆరెమైసమ్మ మీదుగా హిమాయత్ నగర్ చేరుకుంది .రాత్రి బస అక్కడే చేసి ఉదయం పాదయాత్ర మొదలు కానుంది. ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షడు లాల్ సింగ్ ఆర్య, బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజా సింగ్, నేతలు స్వామి గౌడ్, ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సంఘీభావం తెల్పనున్నారు.