ఫేస్‌బుక్‌ “ఫేస్‌ రికగ్నైజేషన్‌” ఫీచర్‌ను ఎందుకు ఆపేస్తోంది.. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా..?

ప్రముఖ్ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఫీచర్‌ను ఆపేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. బ్లాగ్‌లో ఈ విషయాన్ని చెప్తూ.. తమ వద్ద ఉన్న వంద కోట్ల మంది యూజర్ల ఫేషియల్‌ డేటాను మొత్తం డిలీట్‌ చేస్తున్నట్లు కూడా స్పష్టంగా వెల్లడించింది. ఫేస్‌ స్కాన్‌ డాటాను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ సంస్థ బ్లాగ్‌లో పేర్కొంది. ఈ యాప్‌లో చురుకుగా ఉంటే మూడవ వంతు మంది ఈ ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఫీచర్‌ కారణంగా సమాజంలో కలవరం నెలకొన్నదంటూ ఫేస్‌బుక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెరోమ్‌ పెసెంటీ అన్నారు. ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ ఆప్షన్‌ విషయంలో ప్రభుత్వం కూడా సరైన రూల్స్‌ను రూపొందించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ ఫీచర్‌ వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది తలెత్తేలా ఉందంటూ ఇప్పటికే అనేకమంది నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఈ కారణాల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ రికగ్నైజేషన్‌ ఫీచర్‌ను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *