కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం నాడు పుల్వామా జిల్లాలోని కస్బా యార్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే మహమద్ (జేఈఏం) టాప్ కమాండర్ యాసిర్ పార్రే, ఐఈడీ బాంబులను అమర్చే ఎక్స్‌పర్ట్, విదేశీ ఉగ్రవాది ఫుర్కాన్‌లు ఉన్నారు. వీరిద్దరు అనేక ఉగ్రదాడుల్లో పాల్గొన్నారని.. వీరిపై అనేక ఉగ్ర కేసులు ఉన్నాయని కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఇంకా మిగతా ఉగ్రవాదులకోసం గాలింపు కొనసాగుతోంది.