దివ్యమైన దైవ పూజార్హమైన పత్రాలను పరిగ్రహించే టప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఎలా పడితే అలా త్రుంచకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం అసలు పుష్పాపచయా(పూలు కోయుట)నికే ఎన్నో నిబంధనలను విధించింది శాస్త్రం. ఇక దేవుని పూజకు వాడే పత్ర పుష్పాల సంగతి వేరే చెప్పాలా? మంత్రయుక్తముగా తులసీదళాలతో త్రుంచాలి.
ఆ చయన మంత్రం ఇదీ…….
శ్లోకం
మాత స్తులసి గోవింద హృదయానంద కారిణి|
నారాయణస్య పూజార్థం చి నోమిత్వాం నమోస్తుతే||
కుసుమైః పారిజాతాద్యైః సుగంధై రపి కేశవః|
త్వయా వినా నైవ తృప్తిః చినోమిత్వామతః శుభే||
త్వయా వినా మహాభాగే సమస్తం కర్మ నిష్ఫలం|
అతుస్తులసీ దేవిత్వాం చినోమి వరదా భవ||
చయనోద్భవ దుఃఖం యద్ధేవితే హృది వర్తతే|
తత్ క్షమస్వ జగన్మాత స్తులసి త్వాం నమామ్యహం||
తాత్పర్యం
అనగా…… పారిజాతం మొదలగు దివ్య సుగంధ పరిమళ భరితమైన పుష్పాలతో పాటు శ్రీహరి పూజార్థం నిన్ను పరి గ్రహిస్తున్నాను. పారిజాత మొదలైన దివ్య పుష్పములను, తులసి మాత నీ పత్రము పుష్పము లేనిదే ఆ శ్రీమన్నారాయణునికి తృప్తి కలగదు.. ఎలాంటి కష్ట నష్టములు అయినను నివారించగల నీ తులసి దళములచే నేను చేయు శ్రీమన్నారాయణుని పూజ నన్ను రక్షించు గాక.. కనుక పూజ నిమిత్తం నిన్ను పరి గ్రహిస్తున్న ఓ జగన్మాత నన్ను క్షమించు….
అని ప్రార్థిస్తూ తులసీ దళాలను త్రుంచాలి…
ఇది దివ్య తులసి పట్ల మన భక్తిని ప్రదర్శించడానికి ఏర్పరిచిన నియమం కాగా మరి కొన్ని నియమాలు ఉన్నాయి అది కూడా పాటించాలి…
తులసీ దళాలను గోళ్లతో తుంచకూడదు లేదా గిల్లరాదు..
స్నానం చెయ్యకుండా పవిత్ర తులసిని తాకరాదు..
పాదరక్షలు ధరించినపుడు తులసిని తాకకూడదు..
తిథి వార నక్షత్రాలలో కొన్ని నిషేదాలు.. కనుక శాస్త్రవచనం అనుసరించి ఆయా తిథి వార నక్షత్రాలును వదిలేయాలి.. శ్రవణ నక్షత్రం ఉన్న రోజున తులసిని కోయరాదు..
శుక్రవారం,మంగళవారం ,గురువారం, ఆదివారం తులసిని త్రుంచరాదు. కేవలం సోమ బుధ శనివారాల్లో మాత్రమే తులసిని పరిగ్రహించవచ్చు.
తులసిని ద్వాదశి అమావాస్య పౌర్ణమి తిథులలో కోయరాదు అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి..
అయితే నిత్యార్చన శీలురైన భక్తులకు ఇంతకు ముందు చెప్పిన మంత్రం ప్రార్థన చేయడం ద్వారా తిథి వార నక్షత్ర దోషం అంటదని మినహాయింపు ఉంది..
తులసిని సాయంకాలం పూట రాత్రిపూట తాకకూడదు..
తులసిని కేవలం తూర్పు, ఉత్తర ముఖంగా నిలబడి కోయవలసి ఉంటుంది. దక్షిణ పశ్చిమ ముఖాలుగా నిలబడి ఔషధ ఉపయోగం కోసం కోయాలి..
కాలం కాని కాలంలో అనగా అర్ధరాత్రి లేదా మిట్టమధ్యాహ్నం వేళలలో తులసి దళాలను కోయకూడదు.. అలా చేస్తే బ్రహ్మ హత్యా పాతకం తగిలి నరక ప్రాప్తి తధ్యమని శాస్త్రవచనం….
తులసి వృక్షాన్ని ఎవరు భక్తి శ్రద్ధలతో, నాటడం ,నీళ్లు పోయడం, ఆరాధించడం, వినయ విధేయతలతో స్పర్శించడం, వంటివి చేస్తారో ,వారికి నిజంగా తులసి కల్పవృక్షం అనడానికి సందేహించక్కర్లేదు. వారి కోరికలన్నీ తీరడం ఖాయం..
ఎవరింట్లో తులసివనం ఉంటుందో సకల పుణ్య తీర్థాల స్వరూపమే అని శాస్త్రవచనం..
పాపాలన్నీ నాశనం చేసే తులసివనం ఎవరు స్నానానంతరం పరిశుభ్రం చేసి పూజిస్తారో (అనగా కల్లాపి చల్లి ముగ్గు వేస్తే) వారు స్వర్గ పట్టణ ప్రవేశానికి అర్హులు..
దేవతలందరికీ ప్రీతికరమైనది తులసి..తులసి వనం ఎక్కడ ఉంటే అక్కడ దేవతలందరూ కొలువై ఉంటారు. తులసి వనంలో తులసి తో చేసే పూజ పితృదేవతలతో సహా సకల దేవతలకు ప్రీతికరమైనది.. ముఖ్యంగా శివకేశవులకు, సమస్తదేవీగణాలకు, విశేషించి పితృదేవతలకు తులసిదళం సమర్పణం అత్యంతావశ్యకం.ప్రీతి దాయకం.. తులసి సమర్పణ ద్వారా మానవులు తమ కర్మ ఫలితాన్ని నిర్మూలనం చేసుకోవచ్చునని శాస్త్ర ప్రమాణం…
శ్రీ రక్ష జోతిష్యలయం
అన్నీ కార్యక్రమాలకు సంప్రదించ గలరు రాజేష్ శర్మ పెందుర్తి బ్రాహ్మణా ఇంచార్జీ
హోమ జప శాంతి కార్యక్రమాలకు ముఖ్య ప్రసిదీ ఐన ..బ్రమశ్రీ ఏలూరు వెంకట రమణ మూర్తి శర్మ గారు.9618688312