యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనస్తత్వం గురించి అందరికి తెలిసిన విషయమే. స్టార్ డమ్ పక్కన పెట్టి ఎంతో సింప్లిసిటిగా ఉంటారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనస్తత్వం గురించి అందరికి తెలిసిన విషయమే. స్టార్ డమ్ పక్కన పెట్టి ఎంతో సింప్లిసిటిగా ఉంటారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమానులు ఎక్కువే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మంది ఎన్టీఆర్‌ను ఇష్టపడుతుంటారు. నటనతోపాటు.. డైలాగ్స్ చెప్పడంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు యంగ్ టైగర్. తాజాగా తెలంగాణ మంత్రి తన కుమారుడితో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు.తన కుమారుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు.
నయన్ జూనియర్ ఎన్టీఆర్‌ను పెద్ద అభిమాని. అందుకే కొడుకు బర్త్ డే సందర్భంగా అతడిని జూనియర్ వద్దకు మంత్రి పువ్వాడ అజయ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. మంత్రి కేటీఆర్‌ను కూడా పువ్వాడ అజయ్ తన కుమారుడితోపాటు వెళ్లి కలిశారు.