కరోనా భయం మళ్లీ వెంటాడుతోంది. ఇప్పటికే సెకండ్ వేవ్ వదిలిన విషాదం నుంచి బయటపడకముందే మళ్లీ టెన్షన్ పెడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపడుతోంది. అక్కడి నుంచి ఆ వేరియంట్ ఇతర దేశాలకు వ్యాపించడంతో మళ్లీ థర్డ్ వేవ్ వస్తుందేమోనన్న భయం ప్రజల్లో వెంటాడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలోని చిక్కమగలూర్ పట్టణంలోని ఓ పాఠశాలలో విద్యార్ధులు, సిబ్బందికి కరోనా బారినపడ్డారు. తొలుత 69 మందికి పాజిటివ్ సోకింది. ఇందులో 59 మంది విద్యార్ధులు ఉండగా.. 10 మంది సిబ్బంది ఉన్నారు. అనంతరం వైద్యులు 457 మంది శాంపిల్స్‌ను సేకరించగా.. వారి సంఖ్య మరింత పెరిగింది. సోమవారం నాటికి స్కూల్ విద్యార్ధుల్లో 90 మంది కరోనా బారినపడ్డారు. మరో 11 మంది సిబ్బందికి కూడా పాజిటివ్‌గా తేలింది. కాగా, సమాచారం తెలుసుకున్న అధికారులు వారం రోజుల పాటు స్కూల్‌కు సీల్ వేశారు. విద్యార్ధులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.