తెలంగాణలో బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌.. కేవలం ఆ నియోజకవర్గాలపైనే

తెలంగాణలో బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. 2023లో అధికారంలోకి వచ్చేందుకు పక్కా స్కెచ్‌ వేస్తూ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి ప్రయత్నంగా ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టిసారించింది. రాష్ట్రంలో ఉన్న 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు గ్రౌండ్‌ సెట్‌ చేసుకునేందుకు ఆర్గనైజింగ్‌ వర్క్‌ షాపును కూడా నిర్వహించింది. భాగ్యనగరంలోని హోటల్‌ కత్రియాలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన ఈ మీటింగ్‌ జరిగింది. అభ్యర్థుల గుర్తింపు విషయం నుంచి మొదలుకొని ఎస్సీ నియోజకవర్గాలలో పార్టీ బలోపేతంపై ఏ విధంగా అడుగులు వేయాలన్న దానిపై చర్చించారు. సీఎం కేసీఆర్‌ దళితులకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేయాలన్న దానిపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. దళితబంధు అమలు విషయాన్ని కూడా ముఖ్య అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ లక్ష్యానికి మిషన్‌-19 అని పేరు కూడా పెట్టారు. 19 ఎస్పీ స్థానాల్లో 19 బీజేపీ దక్కించుకోవాలన్నదే ఈ మిషన్‌-19 లక్ష్యమని బండి సంజయ్‌ అన్నారు. బ ఈ వర్క్‌ షాపులో మాజీ మంత్రులు విజయరామారావు, ఏ చంద్రశేఖర్, బాబుమోహన్, వివేక్, ఎస్. కుమార్, బంగారు శృతి, కొప్పు భాష, పలువురు ఎస్సీ నేతలు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *