ఓ వైపు టీఆర్ఎస్ పర్కార్ హరితహారం పేరుతో పచ్చని హారాన్ని రాష్ట్రమంతటా చేస్తామని చెబుతూనే మరోవైపు నుంచి దేవాలయాల గుట్టలను సాంతం మింగేస్తుంది. ప్రభుత్వ లీజు అనుమతుల పేరిట గ్రానైట్లకోసం ఆలయ భూములకు కన్నాలు పెడుతూ దేవాదాయశాఖలోని కొండలను హాంఫట్ చేసేస్తుంది .ఎంతో ప్రకృతి రమణీయమైన చారిత్రామక శ్రీ వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట పరిసరాల్లో ప్రభుత్వం గ్రానైట్ తవ్వకాలకు లీజుకు ఇవ్వడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేవరప్పుల మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధిలో వందల ఏళ్ల నుంచి శ్రీ వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి గుట్ట ధర్మాపురం, మాధాపురం పరిసరాలు హద్దుల్లో ఉంది. గుట్టపై పంటల సాగుకు కొదవలేదు. జీవనోపాధికి నెలవైన గుట్టల్లో గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం స్థానిక సంస్థల అభ్యంతరాలను స్వీకరంచికుండా లీజులకు ఇవ్వడమేంటని గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు
మాట్లాడితే నా కన్న పెద్దహిందువు లేడని గొప్పలు చెప్తున్న కేసీఆర్… దేవాలయ గుట్టలను ఖాళీ చేయడంపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బరాజశేఖర్, నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మండిపడుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయకార్ రావు హస్తం లేకుండా ఇంత పెద్ద మైనింగ్ జరగదని చెప్పారు.