దేవరుప్పుల బస్ స్టాండ్ ను కాపాడండి : అఖిల పక్షం

పొలిటికల్ వాయిస్ , జనగామ :

జనగాం జిల్లా,దేవరుప్పుల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సంరక్షణకై అఖిల పక్షాలు బందుకు పిలుపునిచ్చి..
ప్రధాన చౌరస్తాలో ధర్నా,రాస్తారోకో చేసి రోడ్డు దిగ్బంధం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం గోలి మల్లారెడ్డి దేవరుప్పుల బస్టాండ్ కోసమై ఆర్టీసీ కి స్థలాన్ని ఇచ్చారని..
కొద్ది సంవత్సరాలుగా అది నిరుపయోగంగా ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేశారని..
బస్టాండ్ ను పరిరక్షించుకొనుటకు అఖిలపక్షం నాయకులు కలిసి ధర్నా,రాస్తారోకో చేస్తున్నామనీ..
అయితే ఆకుటుంబ సభ్యులకు అధికార పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు సహకరిస్తున్నారని..
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అందుకు సహకరించిన వ్యక్తులను శిక్షించాలని..
ఈ మండలకేంద్రంలోని రోడ్డు వద్దకు వచ్చే ప్రజల రద్దీ ఎక్కువ ఉండడంతో మహిళలకు ఉపయోగపడే విదంగా ఆ స్థలంలో సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలని..
ఈ నియోజకవర్గ స్ధానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీనిపై చొరవ తీసుకొని తక్షణమే సులభ కాంప్లెక్స్ నిర్మాణం ఏర్పాటు చేయాలని..
అంతే కాకుండా ప్రయివేటు వ్యక్తులు ఎవరైతే ఈ స్థలాన్ని ఆక్రమించుటకు సహకరించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గారిచే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశామని, వెంటనే ఆర్టీసీ అధికారులు విచారణ చేసారని వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం లో ఫిర్యాదు చేశామని దేవరుప్పుల బస్ స్టాండ్ అన్యాక్రాంతం కాకుండా బీజేపీ పోరాటం కొనసాగుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు భాగాల నవీన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా.రాజశేఖర్ గౌడ్ ,మండల అధ్యక్షులు భాగాల.నవీన్ రెడ్డి, పెద్దగౌని రాజు , ఉపేందర్ ,తదితర అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *