హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారిని రేప్ చేసి హత్య చేసిన నిందితుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు రోజులుగా గాలింపు చేస్తున్నారు పోలీసులు. రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు స్టేషన్ ఘనపూర్- పెద్ద పెండ్యాల మధ్యలో ఉన్న రైల్వే గ్యాంగ్ మెన్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేతిపై ఉన్న పచ్చ బొట్టు తో మృతుడిని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి పరిశీలించారు.