పూరీ జగన్నాథ్ రథ యాత్ర సందర్భంగా అందరికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశ సంస్కృతిలో రథ యాత్ర కు గల ప్రాముఖ్యాన్ని కళ్ళ కు కట్టేటటువంటి ఒక వీడియో ను కూడా నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో..
‘‘రథ యాత్ర సందర్భం లో ప్రతి ఒక్క వ్యక్తి కి ఇవే అభినందన లు. ఈ పవిత్రమైనటువంటి సందర్భాన్ని మనం ఉత్సవం గా జరుపుకొంటున్న తరుణం లో, భగవాన్ జగన్నాథుని ఈ దివ్య యాత్ర మన జీవనంలో ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఆధ్యాత్మిక పరమైన సమృద్ధిని అనుగ్రహించు గాక.’’ అని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.