అమరావతి : జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం (15 ఆగస్టు) మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ నేతలు హాజరవుతారు