హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మాదిగ నాయకులు వివక్షకు గురవతున్నారని , మాదిగ వర్గానికి చెందిన నాయకులకు అవకాశాలు రాకుండా అణచివేస్తున్నారని మాదిగ నాయకులు ఆరోపిస్తున్నారు. గాంధీభవన్ లోనే బక్కజడ్సన్ , సతీశ్ మాదిగ నేతృత్వంలో నాయకులు సమావేశమయ్యారు . కాంగ్రెస్ పార్టీలో పదవులన్నీ మాలలకే కట్టబెడుతున్నారని , రాష్ట్రంలో 45 లక్షల జనాభా కలిగిన మాదిగలకు నూతన పీసీపీ కమిటీలో పదవులు లేవని వారు దుయ్యబట్టారు . దళిత ఆత్మగౌరవ సభ వేదికల మీద కూడా మాదిగలకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని వారు ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీలో మాదిగల మీద రాజకీయ దాడులు జరిగినా కూడా పట్టించుకునే నాధుడు లేదని వారు బాధపడ్డారు. తెలంగానలో మాదిగలు కాంగ్రెస్ పార్టీ వైపు నడవాలంటే మాదిగ వర్గానికి సంబంధించిన నాయకులకు పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించాలన్నారు .