రంగారెడ్డి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కు మున్నూరుకాపు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆరవ రోజు పాదయాత్ర లో ఉన్న బండి సంజయ్ ను చేవెళ్ల మోడల్ కాలనీ లో ఉదయం కలిసి తమ మద్దతును, సంఘీభవాన్ని ప్రకంటించారు మున్నారుకాపులు.
రాష్ట్రంలో అన్ని కుల సంఘాలు భవనాలు కట్టిస్తా అని ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా కేసీఆర్ సర్కారు ఎత్తలేదని, కేవలం ఎన్నికల సమయంలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఈ సందర్భంగా మండి పడ్డారు.2023 లో బీజేపీ అధికారంలోకి రాగానే సబ్బండ వర్ణాలకు మద్దతుగా ప్రభుత్వం ఉంటుందన్నారు.
రాష్ట్రంలో బీసీ ల రాజ్యం రావాలని అందుకే బండి సంజయ్ యాత్ర కు మద్దతు ఇస్తున్నామని, తెలంగాణ లో అత్యధిక శాతం ఉన్న మున్నూరుకాపు ల ను కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు మీసాల చంద్రయ్య పటేల్, బుక్క వేణుగోపాల్ పటేల్, ఎడ్ల రవి పటేల్, ఆకుల నగేష్, సామల వేణు, ఆకుల విజయ, సోమారపు అరుణ్, గంట శ్రీనివాస్, పొన్న వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.