ఏషియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జేవార్‌లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. దీనికి గురువారం నాడు సీఎం యోగీతో కలిసి ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మొత్తం 1,330 ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించనున్నారు. దీనికి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పేరుపెట్టనున్నారు. దీనిని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ సంస్థ డెవలప్ చేస్తోంది. ఈ విమానాశ్రయం 2024 వరకు అందుబాటులో రాబోతుంది. అయితే ఈ విమానాశ్రయానికి సంబంధించి ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
విమానాశ్రయ శంకుస్థాపన అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే యూపీలో మౌలిక వసతుల అభివృద్ధి జరగలేదంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు. అయితే ఈ క్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తన హయాంలో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌కు బ్రేకులు వేసిందని.. దీనికి అప్పడి యూపీఏ ప్రభుత్వమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్‌ను పదేళ్లు తొక్కిపెట్టిందని.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం మాయావతి చేసిన ఈ వ్యాఖ్యలతో యూపీ డెవలప్ మెంట్‌ను అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాయావతి చెప్పకనే చెప్పిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ యూపీలో అంతంతమాత్రం ప్రభావం చూపుతుండగా.. ఇప్పుడు మాయావతి చెప్పిన నగ్నసత్యాలతో ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఎలా స్టెప్స్ వేస్తుందో వేచిచూడాల్సిందే.