త్రిపురలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతి..!

త్రిపురలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నార్త్ త్రిపుర జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పానిసాగర్‌ సబ్‌డివిజన్‌ ప్రాంతంలో ఉన్న హంప్సపర బ్రు క్యాంప్‌లో ఉన్న పద్దెనిమిది ఇళ్లకు నిప్పంటుకోవడంతో అన్నీ ఆగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ ఘటనకు షార్ట్‌ సర్క్యూట్‌ ఏ కారణం అయి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. బాధిత కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించామని.. రాష్ట్ర అధికారుల నుంచి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వాధికారులు వెల్లడించారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *