గీతాజయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ లక్షయువగళ గీతార్చన కార్యక్రమం చేపట్టబోతుంది. డిసెంబర్ 14వ తేదీన భాగ్యనగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విశ్వహిందూ పరిషత్ మల్కాజ్‌గిరి జిల్లా ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. మల్కాజ్‌గిరిలోని గీతాభవన్ నుంచి రథయాత్రను శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి శిష్యులు శ్రీమాన్ సౌమిత్రి వేణుగోపాలాచార్యులు, మల్కాజిగిరి భాగ్ సంఘచాలక్ నాగేశ్వర శర్మ గారు, విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు శ్రీ భేరి సునీత రామ్ మోహన్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు శ్రీమతి భేరి సునితా రాం మోహన్ రెడ్డి గారు లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం భక్తులనుద్దేశించి శ్రీమాన్ సౌమిత్రి వేణుగోపాలాచార్యులు దివ్యసందేశాన్ని అందజేశారు. విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో లక్షలో ఒకరిగా ప్రతి ఒక్క హిందూవు పాల్గొనాలని సూచించారు. త్రేతా యుగంలో శ్రీరామచంద్రుడు ఆచరిస్తే.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించారన్నారు. అలాంటి భగవద్గీతను ప్రతి ఒక్క హిందువు చదివి ఆచరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మహాంకాళి విభాగ్ సహకార్యదర్శి దాసన్ జీ, అణుశక్తి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి పద్మ శైలజ గారు, జిల్లా కార్యదర్శి రజినీకాంత్, కోషాధికారి పవన్, సహకార్యదర్శి విజయ్, మాతృ శక్తి సంయోజిక పశ్యంతి, జిల్లా సేవా ప్రముఖ్ కమల్ పంత్ గారు, దుర్గా వాహిని సంయోజిక జ్యోతి, మల్కాజిగిరి నగర్ కార్యవాహా రామేశ్వర్, మల్కాజ్ గిరి ప్రఖండ కార్యదర్శి శివ, బజరంగ్ దళ్ సమ్యోజక్ నికిలేష్, నేరెడ్‌మెట్ సత్సంగ ప్రముఖ్ మణిమాల గారు, స్థానిక బీజేపీ నేతలు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్, కార్పోరేటర్లు శ్రావణ్, సునీతా యాదవ్, స్వచ్ భారత్ కన్వీనర్ బక్క నాగరాజు, మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యదర్శి కుర్ర పుణ్యరాజు, BJYM నేతలు ఉడుత నవీన్, కిరణ్, హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.