యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అఖిలేష్‌ సన్నిహితుడి ఇంట్లో భారీగా బయటపడ్డ కరెన్సీ కట్టలు..

యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన పీయూష్‌ జైన్‌ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీయూష్‌ జైన్‌ ఇంటిపై ఇన్‌కం టాక్స్‌ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో కాన్పూర్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తుండగా రెండు బీరువాలు అనుమానాస్పదంగా కన్పించాయి. దీంతో అధికారులు ఆ రెండు బీరువాలను తెరిచి చూడటంతో ఖంగుతిన్నారు. కరెన్సీ నోట్ల కట్టలు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. ఫేక్‌ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.150 కోట్లకు పైగా నోట్ల కట్టలను లెక్కించగా.. ఇంకా లెక్కింపు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, పీయూష్‌ జైన్‌కు చెందిన మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలోని కార్యాలయాలపై కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అఖిలేష్‌ యాదవ్‌ సన్నిహితుడి ఇంట్లో ఇలా కరెన్సీ కట్టలు బయటపడటం.. ఇదంతా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకే అన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ కరెన్సీ కట్టలు ఎన్నికల వేళ అక్రమంగా ఖర్చు చేసేందుకు దాచిఉంటే మాత్రం సమాజ్‌ వాదీ పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బ తగిలినట్లేనన్న అభిప్రాయం వెలువడుతోంది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *