హైదరాబాద్ : వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి నాకేంటీ పార్టీలో మాత్రం నాకంటే జూనియర్ అన్నట్టు హరీశ్ రావు అనుకుంటున్నారా ? పార్టీ ప్రోటోకాల్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో పెట్టకుండా కేవలం మామ కేసీఆర్ ఫోటో మాత్రమే పెట్టి పార్టీలో కేసీఆర్ తర్వాత నాకంటే ఎవ్వరూ లేరనే విధంగా క్యాడర్ కు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారేమో హరీశ్ . కానీ సోషల్ మీడియాలో మాత్రం కేటీఆర్ ఫోటో లేకుండా పెడుతుండటంలో సొంత పార్టీ కార్యకర్తలు కూడా దీని వెనక ఏదో తతంగం ఉందని మాత్రం కామెంట్ చేస్తున్నారు. ఎట్లాగు సీఎం ఫోటో పెడుతున్నారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పేంటి , తనకన్నా కేటీఆర్ పార్టీలో చిన్నవాడు అని చెప్పుకోవడం కోసమే అని సంకేతం ఇస్తున్నట్టు తెలుస్తుంది .