సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల

మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యంగం అమలవుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు పాతరవేయబోతున్నారంటూ జోస్యం చెప్పారు. కేసీఆర్ అరిష్టపాలనను అంతం చేయాలని ప్రజలు భావిస్తున్నారని.. దళిత బంధు పథకాన్ని యావత్‌ తెలంగాణ దళిత సమాజానికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల కోసమే పథకాలను ప్రవేశపెడుతారని.. ప్రజల కోసం కాదంటూ ఆరోపణలు చేశారు. సీఎం కుర్చీని ఎడమ కాలి చెప్పుతో పోల్చి.. యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌ అవమానపరిచారన్నారు. హుజురాబాద్‌ గెలుపు నియోజకవర్గ ప్రజలకు అంకితమన్నారు.

డీజీపీకి ఈటల ప్రశ్నలు
హుజురాబాద్‌ ఉపఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలను పోలీసులు బెదిరించారంటూ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బెదిరించిన ఆధారాలను ఎన్నికల సంఘానికి పంపిస్తానన్నారు. తెలంగాణ ప్రజానీకం ఆకలినైనా భరిస్తోంది కానీ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోదని.. బానిసత్వం చెల్లదని హుజురాబాద్ గడ్డ నిరూపించిందన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *