DK Aruna : వాళ్లంతా.. కేసీఆర్ చెంచాగాళ్లు… ఇలా చేస్తేనే ఢిల్లీకి వెళ్లారు..

Political voice : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పంపిణ లేఖ మరోసారి దుమారం రేపుతోంది. ఈ ఘనత తమదంటే తమని టీఆర్ఎస్ , బీజేపీలు పోటి పడుతున్నాయి..

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అదనపు ధాన్యపు కొనుగోళ్ల కోసం కేంద్రం అనుమతి ఇచ్చింది.రాష్ట్రంలో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించి రాతపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత విభాగాలకు పంపింది. దీంతో తమ ఒత్తిడితోనే కేంద్రం దిగి వచ్చిందని, తెలంగాణ మంత్రులు ఢిల్లీ ప్రభుత్వం మెడలు వచ్చి రాత పూర్వకంగా అదనపు ధాన్యం కొనుగోలును సాధించినట్టు టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రకటనలు చేశారు. తమ పోరాటంతోనే కేంద్రం దిగివచ్చిందని స్పష్టం చేశారు..అయితే టీఆర్ఎస్ నేతల ప్రకటనలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. అదనపు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని కేంద్రం చెబితే.. ఆ ఘనత సీఎం కేసీఆర్ చెంచాగాళ్లు తమదని చెప్పుకుంటున్నారని ఆమె మండిపడింది. దీంతో ఎదో సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టింది. ఇలా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరంగా మాత్రమే కేంద్రం జవాబు పంపిందని ఆమె వివరించారు. అంతే కాగి టీఆర్ఎస్ నేతల ఒత్తిడితో ఇది జరగలేదని చెప్పారు. ఇక ఇలా గతంలో కూడా తామే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పుకోవడం వల్లే టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు. ఇక గతంలో తమ మెడపై కత్తిపెట్టి బాయిల్డ్ రైస్ కొనుగోలుపై రాయించుకున్నారని చెప్పిన సీఎం ఇప్పుడు పీఎం నరేంద్ర మోడి మెడలు వచ్చి ధాన్యం కొనుగోలుకు ఒప్పించామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి చెత్త రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. యాసంగి ధాన్యంపై కూడా టీఆర్ఎస్ నేతలు ఇదే మాట మాట్లాడుతున్నరని, ధాన్యం కొనబోమని రైతులను బెదిరిస్తున్నరని,అయితే యాసంగిలొ ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొనదో మేం చూస్తామని అన్నారు…యాసంగిలోనూ రా రైస్ కొనడానికి కేంద్రం సిద్దంగా ఉందని, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటించిన సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పారు. రైతుల జీవితాలతో చలగాటం ఆడితే సమయం వచ్చినప్పుడు తగిన బుద్ది చెబుతారని ఆమె హెచ్చరించారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *