టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ బిజెపి నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ నేతలకు మతిభ్రమించిందని అధికారమదంతోటి చిన్నాపెద్దా తేడాలేకుండా కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నరు. నిబద్ధతతో, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని అహర్నిశలు కష్టపడేవారిపై సంస్కారహీనంగా మాట్లాడుతారా..? ఈ భాష కేసీఆర్ మాట్లాడిస్తున్నడో.. లేక కేటీఆర్ మాట్లాడిస్తుడో గాని సంజాయిషీ చెప్పాలన్నారు. కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి పట్ల, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పట్ల, రాష్ట్ర శాసనసభ్యుడు శ్రీ రఘునందన్ రావు గారి పట్ల సంస్కారహీనంగా, అసభ్యకరంగా మాట్లాడటం శాసనసభ సభ్యుడి స్థాయిని దిగజార్చుతున్నవని, హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు ప్రేలాపనలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నరని దుయ్యబట్టారు. కుసంస్కారంగా మాట్లాడే టీఆర్ఎస్ నాయకులకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. సంస్కారహీనమైన మీ దిక్కుమాలిన స్థాయికి మేం దిగజారం. ఇప్పటికైనా మీ విమర్శలు మానుకోకపోతే హుజురాబాద్ లో పట్టే గతే.. భవిష్యత్ లో తెలంగాణలో జరుగబోతుంది. ఇకముందు ఇటువంటి మాటలు మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకుంటం. గ్యాదరి కిషోర్ నే కాదు.. ఇంకెవరినీ ఉపేక్షించం.. మీ భాషతీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చివరిసారిగా హెచ్చరించారు. కేసీఆర్..! నువ్వు.. నీ ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను అదుపులో పెట్టుకో. లేకపోతే జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యులవుతారని హెచ్చరించారు.