సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో బిజీబిజీగా ఉండనున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే గడపనున్నారు. పర్యటనలో భాగంగా.. ధాన్యం కొనుగోలు, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ కేటాయింపులు, రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపై ఈ టూర్‌లో కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రధాని మోదీతో పాటు.. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌తో పాటు పలువురితో భేటీ అవ్వనున్నారు. దీంట్లో భాగంగా.. రాష్ట్రం నుంచి ఎంత ధాన్యాన్ని సేకరిస్తారో స్పష్టంగా తెలియజేయాలని కోరనున్నారు. ఇక కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంతో పాటుగా.. పలు ప్రాజెక్టుల అనుమతుల విషయంపై గజేంద్ర సింగ్ షెకావత్‌తో చర్చించబోతున్నారు. ఇక విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి చెందిన పలు అంశాల గురించి కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,సీఎస్‌తో పాటుగా పలువురు సీనియర్ అధికారులు కూడా వెళ్లారు.