తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. యాసంగిలో వరి కోనుగోలు అంశంపై మాట్లాడుతూ.. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ అన్నారు. బాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనమని చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని తేల్చిచెప్పిందని.. కానీ అదే సాకుగా సీఎం కేసీఆర్ వరికొనుగోలు చేయమని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాగా సోమవారం సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో కేంద్రప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. బీజేపీని నమ్ముకుంటే సర్వనాశనం కావాల్సిందేని.. మతచిచ్చు పెడుతూ దేశ సమగ్రతను దెబ్బతీస్తారంటూ ఆరోపణలు చేశారు. కేంద్రం పవర్ రిఫామ్స్ పేరుతో రాష్ట్రం మీద కత్తి పెడుతోందంటూ ఆరోపిస్తూ.. ప్రతి బోర్ దగ్గర కరెంట్ మీటర్లను పెట్టాలని కేంద్రం ఆదేశించిందంటూ తెలిపారు. కేంద్రానికి సామాజిక బాధ్యత ఉంటే ధాన్యాన్ని కొనాలంటూ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అయితే కేంద్రం బాయిల్డ్ మాత్రమే కొనమని చెప్పిందని.. దానిని సాకుగా చూపుతూ సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.