పెరిగిన పెట్రోల్ ధరలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో పెట్రోల్ ధరలను తగ్గించేది లేదంటూ స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలపై రూ.5 నుంచి రూ.12 వరకు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. తాము పెట్రో ధరలను ఇప్పటి వరకు వ్యాట్ పెంచలేదని.. అందుకే తగ్గించేది కూడా లేదన్నారు. అంతేకాదు.. అసలు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రమే తగ్గించాలని.. కేంద్రం విధిస్తున్న సెస్‌లను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో పోరాటం చేస్తా..
పెట్రోల్ ధరలపై సెస్‌లను తగ్గించే అంశంపై వీలైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై సెస్‌లను తొలగిస్తే.. ధరలు తగ్గుతాయంటూ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.