Bandi Sanjay : బీజేపీ మిషన్ -19 ఆ..నియోజవర్గాల్లో గెలుపు ఖాయం

TS Politics : రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్రంగా వ్యతిరేకత ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.. ఆ స్థానాల్లో గెలుపు పార్టీ కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మిషన్ 19 పేరుతో చేపట్టిన సమీక్షలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు.

తెలంగాణలో ఉన్న మొత్తం 19 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేయాలని, అందుకు కార్యచరణ రూపోందించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన “ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి” పై “మిషన్ -19” పేరుతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా బీజేపీని చూస్తున్నారని అన్నారు. దీన్ని పార్టీకి అనుకూలంగా మల్చుకుని తగిన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఇక పార్టీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాలు సైతం అంత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అందుకే అక్కడ గెలుపొందేందుకు రాష్ట్ర పార్టీ సైతం ప్రణాళిక రూపొందించిందని చెప్పారు.

ఇక ఇటివల పార్టీ నిర్వహించిన సర్వేలో సైతం ఎస్సీ నియోజవర్గాల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా ఉందని చెప్పారు. సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 19 ఎస్సీ రిజర్వుడు నియోజకర్గాల్లో పార్టీ గెలుపొందనుందని చెప్పారు. ముఖ్యంగా దళితులకు ఇచ్చిన హామిలు నెరవేర్చడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.

మరోవైపు దళితుల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్రమోది కృషి చేస్తున్నారని, అందుకు నిదర్శనమే దేశవ్యాప్తంగా 46 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఇక మోదీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని దేశ ప్రజలు తిప్పికొట్టారని, అందుకే అధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. ప్రధాని మోదీ స్పూర్తితో ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నియోజవర్గ స్థాయిలో సమస్యలపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ సూచించారు.

బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విజయ రామారావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి, ఉఫాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తదితరులు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *