ఢిల్లీ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను హతమార్చుతామంటూ ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఐసిస్ కశ్మీర్ అనే సంస్థ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంభీర్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు సంబంధించిన విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ పేర్కొన్నారు.