ఈ నెల 24 న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ సిటీ ఆఫీస్ లో జరిగిన సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. పాదయాత్రకు సంబంధించిన వివిధ కమిటీలను కూడా పార్టీ ప్రకటించింది. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరినుంచి హుజూరాబాద్ వరకు పాదయాత్ర సాగనుంది.