ఆషాఢ మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు

ఆషాఢ మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు.

ఆషాఢ మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు..? | What is "Aashada  Maasam" according to Telugu calendar? - Telugu Oneindia

ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. ఆషాడ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

Ashada Masam 2021:ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా... | Ashada  Masam 2021 Dates, Importance and Significance in Telugu - Telugu BoldSky

వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది. వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహం తోడై వర్ష రూపంగా, ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి, ఎవరికీ జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్ధం.

ఆషాఢ మాసము ప్రాముఖ్యత

ఈ శూన్యమాసంలో…
‘ఆషాఢ శుద్ధ విదియనాడు’ పూరీ జగన్నాధ రధయాత్ర.
ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమి’గా
ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము – సృమతి కౌస్తుభం’ ఈనాడు వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం వుండాలి. జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమార స్వామిని దర్శించాలి.
ఆషాడ శుద్ధ సప్తమి – మిత్రాఖ్య భాస్కర పూజ అని నీలమత పురణము. ద్వాదశ సప్తమీ వ్రతము. చతుర్వర్గచింతామణి.
ఆషాడ శుద్ధ అష్టమి – మిహషఘ్ని పూజ, సృ్మతి కౌస్తుభం
ఆషాడ శుద్ధ నవమి – ఐంద్రదేవి పూజ
ఆషాడ శుద్ధ దశమి – శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము.
ఆషాఢ శుద్ధ దశమి.. మహలక్ష్మి వ్రతం..
ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు. దధి వ్రతారంభం అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ రోజును చాక్షుషమన్వాం తరాది దినము అంటారు.

ఈ మాసంలో జగన్నాథుని రధయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది.

🤲శూన్యమాసం అంటే?
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శని గ్రహం 2 1/2 సం. పడుతుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు.. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) 12 రాశులలోనూ 12 నెలలు సంచరిస్తే.. సంవత్సర కాలం పూర్తవుతుంది.

సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని, సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని, సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని… ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెబుతారు.

ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు. ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకొంటారు.

marriage subha muhurtham 2021: ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆ నెల  14 వరకూ అగాల్సిందేనట! - no wedding dates till may due sukra moudyami say  vedic scholars | Samayam Telugu

ఆషాడ సప్తమిని భాను సప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు 3 నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి.

ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి.

ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతేకాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు.

ఆషాఢమాసం విశిష్టత/AshadaMasam Visistatha

మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత వుంది. ఇక ఈ ఏడాది ఆషాడం జూలై 10న మొదలైంది. ఆగస్టు 8వ తేదీ వరకూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి నెలను ఆషాడం అంటారు. దీన్ని సూన్య మాసం అని పెద్దలు చెబుతారు. అందుకే శుభ కార్యాలకు అనుకూలం కాదు ఈ మాసం అని చెబుతారు. ఇక వర్ష ఋతువు కూడా ఈమాసంలోనే స్టార్ట్ అవుతుంది. ఈనెలలో చేసే దానాలు, స్నానాలు మంచి ఫలితాన్నిస్తాయని అంటారు.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఆషాఢంలోనే దక్షిణాయనం మొదలవుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే దాకా దక్షిణాయనం అంటారు. ఆషాడ శుద్ధ విదియనాడు పూరీ జగన్నాధ రథయాత్ర జరుగుతుంది. ఇక ఆషాడ సప్తమిని భాను సప్తమి అంటారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఇదే ఆషాడంలో తెలంగాణలో బోనాల ఉత్సవం మొదలవుతుంది.

Riot of colours on 'Mahakali Bonalu'- The New Indian Express

మహంకాళి అమ్మవారికి తయారు చేసే భోజనాన్ని బోనం అని పిలుస్తారు ఇక అమ్మవారికి నివేదన చేసే పర్వ దినాన్నే బోనాల పండగ అంటారు.

తెలంగాణ సంప్రదాయ పండుగ ఆషాఢ బోనాల జాతర | Bonalu celebrations in Hyderabad,  Know about Bonalu - Telugu Oneindia


ఇక ఆరోజుల్లో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండడం వలన, యువకులు అత్తారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు ముందుకు సాగవు. వర్షాలకు తగ్గట్టు విత్తనాలు జల్లుకోవాలి. కనుక ఆషాడంలో కూర్చుంటే ఇబ్బంది కనుక ఎదురు బొదురు పడకూడదని అనేవారు. ఇక ఆరోజుల్లో కాల్వలు, పంపులు ద్వారా కూడా నీరు వచ్చేది కాదు. వ్యవసాయానికి ఇబ్బంది ఉండకూడదని అత్తవారింటికి వెళ్లకూడదని కొత్త అల్లుళ్లకు రూలు పెట్టారు మన పెద్దలు.

ఇక ఇంటి మీద ధ్యాసతో పనులు మానేస్తారనే ఉద్దేశ్యంతో ఆషాడ నియమం పెట్టారు. అలాగే,ఆషాడం ఆనారోగ్య మాసం. కొత్తనీరు ప్రవేశించడం, అది తాగడం వలన విరోచనాలు, చలిజ్వరం తలనొప్పి మొదలైన రోగాలు వస్తాయి. ఇక స్త్రీలు గర్భం ధరించడానికి అనుకూల మాసం కాదు. అశుభ సమయాల్లో, అనారోగ్య సమయంలో గర్భ ధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది.ఇలా అనేక కారణాల వలన ఆషాఢ మాసాన్ని నిషిద్ధ మాసం అంటారు. ఇక ఈమాసంలో స్త్రీ గర్భం దాలిస్తే ప్రసవ సమయానికి ఎండాకాలం వస్తుంది. ఎండ తీవ్రత తల్లీపిల్లలకు మంచిది కాదు.

ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి మన పెద్దలు కట్టుబాట్లు పెట్టారు. ఇక ఈ మాసంలో చాతుర్మాస్య దీక్షలు, వ్రతాలూ చేస్తారు. ఇక ఈ మాసంలో మనిషిలోని సప్త ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. అందుకే ఆషాడం అనే నియమం పెట్టారు. ఇక దీక్షలు కూడా ఈమాసాల్లోనే మొదలవుతాయి. ఎండా కాలం వేడిమికి భూ తాపం హెచ్చి వర్షాకాలంలో భూమిలోకి నీరు ఇంకుతుంది. అందుకే ,తద్వారా పండే కూరగాయలను తినకూడదని నియమం పెట్టారు.

ఇక చాతుర్మాస్య రెండవ మాసం శ్రావణ మాసంలో పెరుగు తినకూడదు. మూడవ నెల భాద్రపద మాసంలో పాలను తాగకూడదు. చివరి మాసం ఆశ్వయుజ మాసంలో కంది,పెసర, సెనగ మొదలుగు పప్పు ధాన్యాలు తినకూడదని పెద్దలు నియమం పెట్టారు.ఈ మాసంలో వచ్చే క్రిమి కీటకాదులు పోవాలంటే, కనీసం మూడు సార్లు అయినా ఆవు పేడతో కాల్చిన పిడకలతో ధూపం వేయాలి. మైసాక్షి వంటి ధూపాన్ని ఇంట్లో వేస్తే,క్రిమి కీటకాలు నివారించబడతాయి. ఇక ఈ కాలంలో వేప, మామిడి, జామ,మొదలైన మేలు చేసే పండ్ల మొక్కలు నాటాలి.

ఆషాడమాసం_వైశిష్ట్యం

శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్నా… ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసరించే మాసం ‘ఆషాడమాసం’ నాలుగు నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాషాడ నక్షత్రం సమీపంలోగానీ సంచరిస్తూ ఉంటాడు. కనుక ఈ మాసానికి ‘ఆషాఢమాసం’ అనే పేరు ఏర్పడింది.

రోజు కాకపోయినా ఆషాడమాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీసుబ్రహ్యణ్యస్వామి వారిని పూజించి కేవలం నీటిని మాత్ర మే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది.

ఆషాడమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాడమాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాడమాసంలోనే చాతుర్మాన్య దీక్ష మొదలవుతుంది.

కాగా ఆషాడమాసం అనగానే గుర్తుకువచ్చే విషయం వివాహమైన తరువవాత వచ్చే తొలి ఆషాడమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే కలిసి ఉండరాదు అనే విషయం అంటే పెళ్ళయిన తొలి ఆషాడమాసంలో అత్తాకోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కాని సామాజికంగ, చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది. ఆషాడమాసంలో భార్యభర్తలు కలిసుంటే గర్భం ధరించి బిడ్డ పుట్టేవరకు చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.

ఆషాడమాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్య దినాలు ఉన్నాయి.
శుక్లపక్ష ఏకాదశి : తొలి ఏకాదశి

దీనికే ప్రథమ ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా పేరు. శ్రీమహావిష్ణువు ఈ దినం మొదలుకొని నాలుగు నెలల పాటు పాలకడలిలో శేష శయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి. మరునాడు ద్వాదశినాడు తిరిగి శ్రీమహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అటుపిమ్మట భోజనం చేయవలెను. ఈ రోజు నుండే చాతుర్మాన్య వ్రతం ప్రారంభమవుతుంది.

ఆషాఢమాసం ప్రారంభం-బోనాల ఉత్సవాలు

శుక్ల పూర్ణిమ : వ్యాసపూర్ణిమ / గురుపూర్ణిమ, శ్రీవేదవ్యాసుల వారి జన్మదినంగా చెప్పబడుతూ ఉన్న ఈ రోజును వ్యాసుడిని, కృష్ణుడిని, గురువరంవరను పూజించాలని శాస్త్ర వచనం, కృష్ణ పక్ష అమావాస్య : దీప పూజ, అషాడమాసం చివరి రోజు అయిన అమావాస్యనాడు చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి దీపపు స్తంభాలను వుంచి వెలిగించి పూలు, లడ్డూలు సమర్పించవలెను.

శ్రీ రక్ష జోతిష్యలయం
అన్నీ కార్యక్రమాలకు సంప్రదించ గలరు రాజేష్ శర్మ పెందుర్తి బ్రాహ్మణా ఇంచార్జీ
🙏 హోమ జప శాంతి కార్యక్రమాలకు ముఖ్య ప్రసిదీ ఐన ..బ్రమశ్రీ ఏలూరు వెంకట రమణ మూర్తి శర్మ గారు.9618688312

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *