ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని యూసుఫ్ గూడ మెయిన్‌రోడ్‌పై రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసి.. నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, కరాటే కల్యాణి తదితరులు పాల్గొన్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేశారు. వీరందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలలించారు.