హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ బుధవారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీరందర్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈటల ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోలను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్ అన్నకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.