తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. తెలంగాఱలొ 12 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఉండగా..కరీంనగర్ , మహబూబ్నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ అవనున్నాయి. వీటన్నింటికీ కలిపి నవంబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ ఎన్నికల కోసం నామినేషన్లను నవంబర్ 23 వరకూ స్వీకరిస్తారు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 వరకూ నామినేషనలను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ పేర్కొంది.