కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండల కేంద్రంలో S.I ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసుబృందం తనిఖీ జరపగా, రేషన్ బియ్యం స్మలింగ్ చేస్తున్న ముఠాను పట్టుపడ్డారు. వివరాలలోకి వెళితే, గన్నేరువరం మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ముందున్న కొనగాని అంజయ్య అలియాస్ గాండు అంజయ్య (55) ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కొనగాని అంజయ్య అలియాస్ గాండు అంజయ్య వ్యక్తి మరో వ్యక్తితో ముఠాగా ఏర్పడి గత కొంత కాలంగా, తన ఇంటిని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నాడు. దగ్గరలో ఉన్న రేషన్ షాపులో బియ్యాన్ని దొంగిలించి రాత్రి పూట కరీంనగర్ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఎప్పటిలాగే అంత సిద్ధం చేసుకోగా, S.I. ఆవుల తిరుపతి వలపన్ని పట్టుకున్నారు. పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దోషులను గట్టిగా విచారిస్తే పెద్ద స్మగ్లింగ్ రాకెట్ బయటపడే అవకాశం ఉంది.