హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ యువమోర్చాజాతీయ కమిటీలో తెలంగాణకు చెందిన సోలంకి శ్రీనివాస్ ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు ఎంపీ,జాతీయ అద్యక్షుడు తేజస్వీసూర్య. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏబీవీపి నాయకుడిగా తర్వాత తెలంగాణ బీజేవైఎం లో పనిచేసిన సోలంకిని జాతీయ పార్టీ గుర్తించింది. ఇప్పటికే జాతీయ కమిటీలో సెక్రటరీగా షెహజాది, కోశాధికారిగా సాయిని తీసుకోగా ఇప్పుడు మరోపదవి తెలంగాణకు లభించినట్టయ్యింది. జాతీయ అద్యక్షుడు తేజస్వీసూర్యకు, రాష్ట్ర పార్టీకి సోలంకి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.