పొలిటికల్ వాయిస్ : తమిళనాడు రాష్ట్రం సూలూరు లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ బిపిన్ రావత్ దుర్మణం పాలయ్యారు. ఆయనతో పాటు ప్రమాదంలో ఆయన భార్య కూడా మరణించారు. ఈ ప్రయాణంలో ఉన్న మొత్తం 14 మంది కూడా తీవ్రంగా గాయపడి చనిపోయారు. నలుగురు సంఘటనా స్థలంలోనే మరణించగా మిగిలినవారిన ఆసుపత్రికి తరలించేక్రమంలో కొందరు, ఆసుపత్రిలో మరికొందరు చనిపోయారు. సంఘటన పై వాయుసేన ఇప్పటికే విచారణ ప్రారంభించింది. కేంద్రప్రభుత్వం మరికాసేపట్లో ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. జరిగిన సంఘటన ప్రమాదరమా లేదా కుట్ర ఉందా అనేది కూడా విచారిస్తున్నారు.