రంగారెడ్డి : ప్రజాసంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరుకున్నది. చార్మినార్ భాగ్యక్ష్మి మందిరం నుంచి ప్రారంభం అయిన యాత్ర రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టింది. హిమాయత్ నగర్ గ్రామం నుంచి ప్రారంభం అయ్యింది. అక్కడ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు సంజయ్.
రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలు పెట్టి చిలుకూరుచౌరస్తాకు చేరుకున్నారు . అక్కడ వేలాది మంది మహిళలు బోనాలతో సంజయ్ కు స్వాగతం పలికారు.
చిలుకూరు బాలాజీ చౌరస్తా నుంచి పాదయాత్ర మొయినాబాద్ వైపు వేలాది మంది ప్రజలతో సాగింది. దారిపొడవును ప్రజలు స్వాగతం పలికారు. పలు చోట్ల కొందరు తమ బాధలు చెప్పుకున్నారు.
బీజేపీ కార్యకర్తలు , అభిమానులు తమ కుటుంబాలతో సహా వచ్చి ఎదురేగి స్వాగతం పలికారు పాదయాత్రకు. సంఘీబావంగా వారు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.
నాలుగో రోజు పాదయాత్రకు మద్దతు పలకడానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర హాజరయ్యారు. పాదయాత్రలో పార్టీ జెండా చేబూని అడుగులు సంబిత్ పాత్ర కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పాదయాత్ర వివరాలను రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను బండి సంజయ్, ఇంద్రసేనా రెడ్డిలతో చర్చిస్తూ కనిపించారు .