హైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నిక తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ ప్రకటించింది. ఈటెల రాజేందర్ రాజీనామా తో జరుగుతున్న ఉపఎన్నిక లో బీజేపీ అభ్యర్థిగా రాజేందర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తెరాస అభ్యర్థిగా అనేక తర్జన భర్జన ల తర్వాత గెల్లు ను ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది.