తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్‌తో భయపడుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తుంటే.. మరోవైపు తెలంగాణ సర్కార్ మాత్రం న్యూ ఇయర్ వేడుకలకు ఆఘమేఘాల మీద అనుమతులు ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని వదిలేసి.. కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే ఇలా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులిచ్చారన్నారు. అర్ధరాత్రి వరకు మద్యం షాపులకు అనుమతివ్వడం ఏంటని ప్రశ్నించారు. ఒమిక్రాన్‌తో దేశ వ్యాప్తంగా ముప్పు పొంచిఉందని.. ఈ సమయంలో కేసీఆర్ సర్కార్ న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులివ్వడం దుర్మార్గమని.. దీనిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి అన్నారు.