హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మాతృమూర్తి శ్రీమతి కృష్ణ కుమారి ( 77) అనారోగ్యంతో ఈరోజు ఉదయం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో పరమపదించారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పార్థివ శరీరం రాజ్ భవన్ లో ఉంచుతారు. తర్వాత ఆంత్యక్రియల కోసం చెన్నై తరలిస్థారు.
విషయం తెలియగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు రాజ్ భవన్ చేరుకుని శ్రీమతి కృష్ణకుమారి పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను ఓదార్చారు.