కరోనా మహమ్మారి కాస్త అదుపులోకి వస్తుందనుకున్న వేళ.. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలకలం రేపుతోంది. ఇటీవల అక్కడి నుంచి భారత్‌కు వచ్చిన పలువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే వీరిలో ఉన్నది ఏ వేరియంట్ అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ.. ఒమైక్రాన్ వేరియంట్ అన్న భయం పట్టుకుంది. ఇటీవల సౌతాఫ్రికా నుంచి ఛండీగడ్‌కు వచ్చిన ఓ 39 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్రపాలిత ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
నవంబర్ 21వ తేదీన ఆయన భారత్‌కు వచ్చారని.. అయితే అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా అతడికి నెగిటివ్ అని వచ్చిందన్నారు. అయితే ఆ తర్వాత హోం క్వారంటైన్‌లో ఉంచారని.. అనంతరం ఏడురోజుల తర్వాత పరీక్షించగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆయనతో పాటుగా.. ఇయన స్నేహితులిద్దరికీ.. ఒక కుటుంబ సభ్యుడికి, ఓ పసివాడికి కూడా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయన కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరికి కరోనా నెగిటివ్ అని తేలింది. ఇంకోకరి రిపోర్టు రావాల్సి ఉంది. అయితే వీరికి సోకిన వేరియంట్‌ను పరీక్షించేందుకు శాంపిల్స్‌ను ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపించారు.