బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో వరి వేస్తే ఉరే అంటున్న సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ “రైతు దీక్ష” చేపట్టారు. కేంద్రం ధాన్యాన్ని కొనడం లేదంటూ సీఎం, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారం పై మండిపడ్డారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు.
*సాయంత్రం 5 గంటల లోపు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కేంద్రం రాసిన లేఖను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు.
*లేనిపక్షంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు.
*రైతుల పాలిట సీఎం కేసీఆర్ రాబందుగా మారాడు.
*ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా సీఎం లేఖ రాస్తే.. కేంద్రాన్ని ఒప్పిస్తాం. రైతు పండించిన ధాన్యాన్ని మొత్తం కనిపించే బాధ్యత మేం తీసుకుంటాం.
*తాము ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ముగిసిన తరువాత కూడా హుజూరాబాద్ ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన మంత్రులపై సుమోటోగా చర్యలు తీసుకోవాలి. ఆ మంత్రిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.
*కోర్టులను దిక్కరించే వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ పై చట్ట, న్యాయపరమైన పోరాటం చేస్తాం.
తెలంగాణలో పండిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేస్తోంది. అన్నీ కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?
పండించిన ప్రతీ పంటను తామే కొంటామన్న కేసీఆర్ నోరు ఎందుకు విప్పడం లేదు?
*వరి మీద కంటే కేసీఆర్ కు లిక్కర్ మీద ప్రేమ ఎక్కువ. తెలంగాణలో “వరి బంద్” పథకాన్నీ అమలు చేయాలనుకుంటున్నారు.
వరి కాకుండా ఏ పంట పండించాలో ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడం సిగ్గుచేటు.
వరి పంట వేయకుంటే లక్షల కోట్ల పెట్టి కాళేశ్వరం ప్రాజక్ట్ ఎందుకు కట్టినట్లు? వేల కోట్లు కమీషన్ దొబ్బుకుతున్నారు.
రైతుబందు ఇచ్చి.. సీఎం కేసీఆర్ అన్నీ బంద్ చేస్తున్నాడు.
వడ్లు కొనేది కేంద్రమే
ధాన్యం కొనుగోలు చేసేది కేంద్రమే. ఈ విషయంలో సీఎం కేసీఆర్ మధ్యవర్తి (బ్రోకర్) మాత్రమే.కమీషన్ల కోసం మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
రీసైక్లింగ్ పేరుతో గతంలో టి ఆర్ ఎస్ పెద్ద ఎత్తున్న అవినీతి చేసింది.
ఆ స్కామ్ ను త్వరలోనే బయట పెడతాం
వరి కొనబోము అని సీఎం, మంత్రులు ఎందుకు చెప్పుతున్నరు?… కేంద్రం మీకు ఎవరైనా ఫోన్ చేసి కొనబోము అని చెప్పారా?
కేంద్రం ధాన్యాన్ని కొనడానికి సిద్ధంగా ఉంది…కేసీఆర్ పిట్టల దొర మాటలు రైతులు ఎవరు నమ్మవద్దని కోరుతున్నా.
ధాన్యాన్ని కొనబోo అని కేంద్రము లేఖ రాసిందా? దమ్ముంటే ఆ లేఖను బహిర్గతం చెయాలి.. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్
దీక్ష ఆరంభం మాత్రమే … రైతులను ఇబ్బంది పెడితే ఉద్యమిస్తాం. రేపటి నుండి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్టమంతటా ఆందోళనలు చేస్తాం. కేసీఆర్ మెడలు వంచుతాం.
రైతుల గోస, ఉసురు కేసీఆర్ కు తగులుతుంది.
లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు
ఆ ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున్న అవినీతి దాగి ఉంది
ఎక్కడ నీళ్లు కనిపించినా కాళేశ్వరం నీళ్లు అంటున్నారు
రైతుల పాలిట రాబందు గా మారారు.
సీఎం కేసీఆర్ కొత్త స్కీం తెచ్చారు…దానిపేరు “వరి బంద్ స్కిం”
కలెక్టర్ ఏమో సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన వరి విత్తనాలు అమ్మవద్దు అంటున్నారు
వరి వేయవద్దని మంత్రులు రైతులను బయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కేసీఆర్ కాళ్ళుమొక్కుతే ఏది మాట్లాడినా నడుస్తుందని బలిసి, బరితెగించి మాట్లాడుతున్నారు.
కేసీఆర్ కన్ ఫ్యుజ్ ముఖ్యమంత్రి
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి రైతులను అరిగోస పెడుతున్నారు
సీఎం కేసీఆర్ మిడ్ నైట్ ముఖ్యమంత్రి. సోయిలేకుండా అన్ని నిర్ణయాలు అర్ధ రాత్రులు తీసుకుంటారు. అసలు
సీఎం కేసీఆర్ బాధ ఏందో చెప్పాలి.