మేషం
ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.
వృషభం
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
మిధునం
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులు విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన వ్యాపార విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం
వ్యాపార విషయంలో కీలక ఆలోచనలు ఆచరణలో పెడతారు. కుటుంబ సభ్యులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.
సింహం
మొండి బాకీలు వసూలవుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ముందుకి సాగుతాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.
కన్య
ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కొంత ఊరట కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఏర్పడతాయి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది.
తుల
గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు మందగిస్తాయి. మీ ప్రవర్తన బంధువులకు నచ్చదు. వ్యాపారస్తులకు నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
వృశ్చికం
పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలను గూర్చి చర్చిస్తారు. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు చికాకులు తొలగుతాయి.
ధనస్సు
కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు జీత భత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి.
మకరం
కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు లభించిన అవకాశములు చేజారతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తుల అంచనాలు నిజం కావు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
కుంభం
చేపట్టిన కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. శారీరక అనారోగ్య సమస్యలుంటాయి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారులకు నిరాశ తప్పదు. ఉద్యోగులు పని ఒత్తిడి పెరుగుతుంది.
మీనo
చేపట్టిన కార్యక్రమాలలో అనుకూలత కలుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారములకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగ విషయమై అధికారుల నుండి శుభవార్తలు అందుకుంటరు
శ్రీ రక్ష జోతిష్యలయం
అన్నీ కార్యక్రమాలకు సంప్రదించ గలరు రాజేష్ శర్మ పెందుర్తి బ్రాహ్మణా ఇంచార్జీ
హోమ జప శాంతికార్యక్రమాలకు ముఖ్య ప్రసిదీ ఐన ..బ్రమశ్రీ ఏలూరు వెంకట రమణ మూర్తి శర్మ గారు.9618688312